శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

శ్రీశైలం: భూ కైలాస క్షేత్రం శ్రీశైలాన్ని సందర్శించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. శ్రీశైల మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన ఆమెకు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి లవన్న, అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం ఆలయంలోకి తీసుకువెళ్లి స్వామి అమ్మవార్లను దర్శనం చేయించారు.
అనంతరం అమ్మవారి ఆలయం వద్దగల ఆశీర్వచన మండపంలో వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి అమ్మవారల ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు. కర్నూలు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, దేవస్థాన ఈవో లవన్న రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు స్వామివారి శేషవస్త్రాలను, ప్రసాదాలను, స్వామి అమ్మవార్ల జ్ఞాపికను అందించి సత్కరించారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వెంట కర్నూలు జిల్లా ఎస్ పి సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, కర్నూలు ఆర్ డిఓ హరి ప్రసాద్, ఆత్మకూరు డిఎస్పీ శృతి తదితరులున్నారు.

 

ఇవి కూడా చదవండి

ఒక్క కశ్మీరీ పండిట్ కుటుంబాన్నైనా స్వస్థలానికి పంపారా?

గురుగావ్ లో మల్టీఫ్లెక్స్ కడుతోన్న ఐఏఎస్ ఎవరు?

RRR ఓ మాస్టర్ పీస్

నాలుగు రోజుల్లో మూడోసారి.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు