మాతృభాషలో ప్రమాణ స్వీకారం చేసినందుకు గర్వంగా ఉంది

మాతృభాషలో ప్రమాణ స్వీకారం చేసినందుకు గర్వంగా ఉంది

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తెలంగాణ గవర్నర్ తమిళిసై అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆమె చేత రాజ్ నివాస్‌లో మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, మాజీ సీఎం రంగస్వామి, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. పుదుచ్చేరి చరిత్రలో మొదటసారిగా తమిళ్ మాట్లాడే వ్యక్తి గవర్నర్‌గా నియమితులయ్యారు. కిరణ్ బేడీని గవర్నర్ పదవి నుంచి తొలగించడంతో.. నూతన గవర్నర్‌గా తమిళిసైను నియమించారు. తమిళిసై ఇప్పటికే తెలంగాణకు గవర్నర్‌గా పనిచేస్తున్నారు.

పుదుచ్చేరి గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించినందుకు చాలా సంతోషంగా ఉందని తమిళిసై అన్నారు. ‘నా మాతృభాషలో ప్రమాణ స్వీకారం చేసినందుకు గర్వంగా మరియు సంతోషంగా ఉంది’ అని ఆమె ట్వీట్ చేశారు.

For More News..

సారుకు కుటుంబం, ఫాంహౌస్ పచ్చగా ఉంటే చాలు

ప్రభుత్వ ప్రోద్భలంతోనే లాయర్ దంపతుల హత్యలు

టెలికంకు రూ.12 వేల కోట్లు ప్రకటించిన కేంద్రం