
రక్తం ఇచ్చి తలసేమియా రోగులకు సాయం చేయాలన్నారు గవర్నర్ తమిళిసై. 33 జిల్లాల్లో పర్యటించి రెడ్ క్రాస్ ను విస్తరించాలని అనుకుంటున్నామన్నారు. ఒక మెసేజ్ చేస్తే రెడ్ క్రాస్ స్పందిస్తుందని.. కరోనా సమయంలో ఆర్మీ, పోలీస్ అధికారులు తలసేమియా రోగులకు బ్లడ్ డొనేషన్ చేశారన్నారు గవర్నర్. రాజ్ భవన్ లో జరిగిన మదర్స్ డే, రెడ్ క్రాస్ డే వేడుకలు సందర్భంగా మాట్లాడారు. పిల్లలకు పౌష్టికమైన ఆహారాన్ని అందించాలని తల్లిదండ్రులను కోరారు. తలసేమియా బాధిత చిన్నారులకు హైజినిక్ కిట్లను అందిస్తున్నట్లు తెలిపారు గవర్నర్.