ఆదిలాబాద్ జిల్లాలో రేపు గవర్నర్ తమిళిసై పర్యటన
V6 Velugu Posted on Nov 14, 2021
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రేపు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జనజాతి గౌరవ దివస్ సందర్భంగా ఆదివాసీల పోరాట యోధుడు బిర్సాముండా జయంతి వేడుకల్లో ఆమె పాల్గొంటారు. ఐటిడిఎ అధికారులు. జిల్లా ఎస్పీతో కలిసి గవర్నర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్ సిక్తా పట్నాయక్. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయ పరిసర ప్రాంతాలు, దర్బార్ హాలులో ఏర్పాట్లను చూశారు. హైదరాబాద్ నుంచి ఉట్నూరుకి హెలికాప్టర్ ద్వారా గవర్నర్ చేరుకుంటారని, అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో కేస్లాపూర్ కు వచ్చి.. ఆదివాసీల కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు కలెక్టర్.
Tagged Telangana, Adilabad District, tour, visit, Governor Tamilsai, TAMILSAI, Birsamunda, birth celebrations