
కరోనా వైరస్ ఎఫెక్ట్ జీఎస్టీ వసూలుపై కూడా పడింది. ఫిబ్రవరి నెల కన్నా మార్చి నెలలో ఈ పన్సు రాబడి దాదాపు రూ.7 వేల కోట్లకు పైగా తగ్గింది. ఫిబ్రవరిలో రూ.1.05 లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో కేంద్రానికి రాగా.. మార్చి నెలలో రూ.97,597 కోట్లు వచ్చింది.
మొత్తం రూ.97,597 కోట్లలో రాబడిలో సెంట్రల్ జీఎస్టీ వాటా రూ.19,183 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.25,601 కోట్లు ఉనట్లు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ప్రకటించింది. ఇక ఇంపోర్ట్స్ పై వసూలు చేసిన రూ.18,056 కోట్ల పన్నుతో కలిపి ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.44,508 కోట్లు వచ్చినట్లు తెలిపింది. మార్చి 31 వరకు దేశ వ్యాప్తంగా ఫైల్ అయిన జీఎస్టీఆర్-3బీ రిటర్న్స్ 76.5 లక్షలు ఉన్నట్లు పేర్కొంది.