ప్రశ్నించే యువత అంటే ప్రభుత్వానికి నచ్చట్లే

ప్రశ్నించే యువత అంటే ప్రభుత్వానికి నచ్చట్లే

న్యూఢిల్లీ: కొత్త అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు అండగా నిలిచిన యాక్టివిస్ట్ నోదీప్ కౌర్‌‌ను జైలులో వేసిన సంగతి తెలిసిందే. రీసెంట్‌‌గా ఆమెకు బెయిల్ లభించింది. అన్నదాతల ఉద్యమంలో కుట్రకు యత్నించారన్న ఆరోపణలపై అరెస్టయిన నోదీప్‌‌.. నెలన్నరకు పైగా జైలులో ఉన్నారు. పంజాబ్-హరియాణా హైకోర్టు నోదీప్‌‌కు బెయిల్ మంజూరు చేయగా.. కర్నాల్ జైలు నుంచి ఆమె శుక్రవారం బయటకు వచ్చారు.

జైలు నుంచి విడుదలైన అనంతరం నేరుగా ఢిల్లీలోని సింఘూ బార్డర్‌‌లో ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులను నోదీప్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రశ్నించే యువతరం అంటే ప్రభుత్వానికి గిట్టట్లేదన్నారు. ‘కేంద్రం యువతను టార్గెట్‌‌ చేస్తోంది. నిరసనల ద్వారా మేం అహింసకు ప్రేరేపిస్తున్నామని అంటోంది. కానీ చెడుకు వ్యతిరేకంగా పోరాడుతోంది యువత మాత్రమేనని అర్థం చేసుకోవాలి. ప్రజా హక్కుల కోసం నాలాంటి యువతరం పోరాటాలను కొనసాగించాల్సిన అవసరం చాలా ఉంది’ అని నోదీప్ స్పష్టం చేశారు.