ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ డిప్యూటీ గవర్నర్ రాజేశ్వరరావు పదవీకాలం పొడిగింపు

ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ డిప్యూటీ గవర్నర్ రాజేశ్వరరావు పదవీకాలం పొడిగింపు

న్యూఢిల్లీ: ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ డిప్యూటీ గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎం. రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు పదవీకాలాన్ని ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది.  అక్టోబరు 9, 2024 నుంచి అమలులోకి వచ్చే ఒక సంవత్సరం పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు రావును కొనసాగించేందుకు క్యాబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ఆమోదం తెలిపింది. ఈ మేరకు అక్టోబర్ 4న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏసీసీకి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తున్నారు.

రావు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ డిప్యూటీ గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా 2020 అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడేళ్ల కాలానికి నియమితులయ్యారు. 2016లో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పదోన్నతి పొందారు.  యూనివర్సిటీ ఆఫ్ కొచ్చిన్ నుంచి ఎకనామిక్స్ గ్రాడ్యుయేషన్​,  మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిచేసి 1984లో సెంట్రల్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరారు. గతంలో ఆర్​బీఐ రిస్క్ మానిటరింగ్ విభాగం బాధ్యతలు నిర్వహించారు.