ఢిల్లీలో మళ్లీ మాస్క్ తప్పనిసరి

ఢిల్లీలో మళ్లీ మాస్క్ తప్పనిసరి

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే నివారణ చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాలలో మాస్క్ ధరించకపోతే రూ.500 జరిమానా విధించాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలి కాలంలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగానే ఈ ప్రకటన చేసినట్టు ప్రభుత్వం తెలిపింది.

కాగా దేశంలో నాలుగో వేవ్ వస్తుందన్న ఉదంతుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నాయి. కొవిడ్ మొదటి, రెండు, మూడు దశల్లోనూ ఎంతటి ప్రాణ నష్టాన్ని కలిగించిందో అందరికీ తెలిసిందే. మళ్లీ అది రిపీట్ కాకుండా ఉండాలంటే మళ్లీ కరోనా జాగ్రత్తలు పాటించాలని, మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు అప్రమత్తం చేస్తున్నాయి. అయితే దేశ రాజధాని ఢిల్లీలోనూ రోజుకు 2వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతుండడంతో తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.