క్యాంపెయిన్ చేస్తే ఉద్యోగం ఊస్టింగే!

క్యాంపెయిన్ చేస్తే ఉద్యోగం ఊస్టింగే!

ప్రచారం జోరుమీదుంది. ఎవరికిష్టమున్న పార్టీకి వారు ప్రచారం చేసుకుంటున్నారు. కొందరు డైరెక్టుగా అభ్యర్థి వెంట జెండా పట్టుకు ని తిరుగుతుంటే..మరికొందరు సోషల్‌‌‌‌‌‌ మీడియాలో ఉడతాభక్తి చాటుకుంటున్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ చాన్స్‌‌‌‌‌‌ లేదు. ఎన్నికల నియమావళి ప్రకారం వీరంతా కోడ్‌‌‌‌‌‌ పరిధిలో ఉన్నారు. సభలు, సమావేశాల్లో పాల్గొనడం,ప్రచారం చేయడం, పార్టీలు, నేతలకు వ్యతిరేకంగా మాట్లాడడం చేస్తే ఉద్యోగానికి ఎసరొచ్చినట్టే. కోడ్‌‌‌‌‌‌ అమల్లోకి వచ్చిన నాటి నుంచే ఉద్యోగులపై ఈసీ నిఘా పెట్టింది. ప్రత్యేకంగా సోషల్‌‌‌‌‌‌మీడియా అకౌంట్స్‌‌‌‌‌‌పై దృష్టి సారించిం ది.చూడండి..

షేరిం గ్వద్దు

కొందరు ఉద్యోగులు తమకు నచ్చిన నాయకుల కోసం గుట్టుగా ప్రచారం చేస్తుంటా రు. ఎవరూ గమనించడంలేదని తమ వాట్సాప్‌ , ఫేస్‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌, ట్విటర్‌‌‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌‌‌లో అప్‌ లోడిం గ్‌ , షేరింగ్స్‌‌‌‌‌‌ చేస్తుంటారు.ఇలా చేస్తే వెంటనే దొరికిపోవడం ఖాయం. ప్రభుత్వఉద్యోగుల సోషల్‌‌‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌‌‌పై ఈసీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మీరు చేసిన షేరింగ్‌ ను గమనించి ఎవరైనా ఫిర్యా దుచేస్తే వెంటనే స్పందించి విచారణ చేస్తారు.నిజమని తేలితే చర్యలుంటాయి . ఇక మీరు డైరెక్టుగా ప్రచారంలో పాల్గొన్నట్టు ఎవరైనా ఫొటో, వీడియోలను ఆధారాలుగా చూపి ఫిర్యాదు చేసినా ఇబ్బందులు తప్పవు. పోలింగ్‌ సమయంలో ఏపార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా సీసీ కెమెరా ఫుటేజ్‌ విశ్లేషించి చర్యలు తీసుకుంటారు.

ఇవీ రూల్స్‌‌‌‌‌‌  –

  • ప్రభుత్వ ఉద్యోగికి అసెంబ్లీ, లోక్‌‌‌‌‌‌సభ,స్థానికసంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. ఉద్యోగానికి రాజీనామా
  • చేసి పోటీ చేయొచ్చు. కుటుంబ సభ్యుల పోటీకి అభ్యంతరం లేదు. వారి కోసం ప్రచారం చేయకూడదు.

ఇదీ సెక్షన్‌

  • ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలకు ప్రచారం చేయరాదనే నిబంధనలు 1949 సెప్టెంబరు 17వ తేదీ నుంచే అమల్లోకి
  • వచ్చాయి . సెక్షన్‌‌‌‌‌‌ 23 (ఐ) ప్రకారం వారంతా ఎన్నికల కోడ్‌‌‌‌‌‌ పరిధిలోకి వస్తారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుంది.

ఇటీవల కొన్ని ఘటనలు

  • ఓ పార్టీ మీటింగ్‌ లో పాల్గొన్నారనే ఆరోపణలపై హుజురాబాద్‌ ఏసీటీఓను సస్పెండ్‌‌‌‌‌‌ చేశారు. వాట్సాప్‌లో ప్రచార సంబంధ విషయాలు పెట్టారని జగిత్యాల జిల్లా బావోజిపల్లె స్కూల్‌‌‌‌‌‌ టీచర్‌‌‌‌‌‌ను సస్పెండ్‌‌‌‌‌‌ చేశారు.
  • అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయం లో జూనియర్ అసిస్టెంట్‌‌‌‌‌‌ను, హైదరాబాద్‌ లోనిబేగంపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో నర్సును, సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం
  • లోయపల్లి రేషన్‌‌‌‌‌‌ డీలర్‌‌‌‌‌‌ను, నిజామాబాద్‌ డిపో-1లో కండక్టర్‌‌‌‌‌‌ను సస్పెండ్‌‌‌‌‌‌ చేశారు.
  • గుర్తింపు పొందిన వాణిజ్య సంఘం, సిబ్బంది సంక్షేమ కమిటీలు, సహకార సంఘాల ఎన్నికల్లో పాల్గొనొచ్చు.
  • ఎస్సీ, ఎస్టీ కులాల వారికి మినహాయింపు ఉంది. వారు తమ ఉద్యోగాన్ని వదులుకోకుం డానే సెలవు పెట్టి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఓడితే తిరిగి ఉద్యోగంలో కొనసాగవచ్చు.