బీహార్ లో జిల్లాకో మెడికల్ కాలేజీ, ఆస్పత్రి : నితీష్ కుమార్

బీహార్ లో జిల్లాకో మెడికల్ కాలేజీ, ఆస్పత్రి : నితీష్ కుమార్

బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రజలకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీతో పాటు ఆస్పత్రిని ప్రారంభించనున్నట్లు చెప్పారు. పాట్నాలోని బాపు సభాగర్ లో జరిగిన కార్యక్రమంలో 9,469 మంది కొత్తగా ఎంపికైన వైద్యశాఖ ఉద్యోగులకు నియామక పత్రాల అందజేశారు. కొత్త ఉద్యోగాల్లో చేరుతున్న వారిలో సహాయ నర్సులు, ఆరోగ్య సలహాదారులు, సీనియర్ చికిత్స పర్యవేక్షకులు, ఆరోగ్య మేనేజర్లు, జిల్లా కమ్యూనిటీ ప్రమోటర్లు ఉన్నారు. 

ఈ కార్యక్రమం అనంతరం బక్సర్, బెగుసరాయ్‌లలో రూ.515 కోట్లతో నిర్మించనున్న రెండు ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రులకు నితీష్ కుమార్ శంకుస్థాపన చేశారు. వీటితో పాటు 'ముఖ్యమంత్రి డిజిటల్ హెల్త్ స్కీమ్' ను అందుబాటులోకి తెచ్చారు. ఈ పథకంలో భాగంగా వైద్యులే ఇంటికి వచ్చి రోగులకు చికిత్స చేయనున్నారు. ఆరోగ్యశాఖకు చెందిన మరో 24 ప్రాజెక్టులను కూడా సీఎం నితీష్ కుమార్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల కోసం రూ.224 కోట్లను కేటాయించారు.