పాన్ షాప్ ఓనర్ హత్య కేసులో ఐదుగురు అరెస్టు ‌‌‌‌‌‌‌‌... గత నెల 29న గౌస్ నగర్ లో ముసీన్హత్య

పాన్ షాప్ ఓనర్ హత్య కేసులో ఐదుగురు అరెస్టు ‌‌‌‌‌‌‌‌... గత నెల 29న గౌస్ నగర్ లో  ముసీన్హత్య

ఓల్డ్​ సిటీ, వెలుగు: గౌస్​నగర్​లో పాన్​షాప్ యజమాని ముసీన్ హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు చాంద్రాయణ గుట్ట ఏసీపీ సుధాకర్​ తెలిపారు. శనివారం బండ్లగూడ పోలీస్ స్టేషన్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెల 29న ముసీన్​హత్య జరిగిందన్నారు. నిందితులు సయ్యద్​ షా ఫహాద్, సయ్యద్​సోహెల్, మహమ్మద్​హమీర్, మహమ్మద్​బిన్ అబ్దుల్లా సైఫ్, షేక్​ అఫ్రోజ్​అరెస్ట్​చేసినట్లు పేర్కొన్నారు. సీఐ దేవేందర్ తదితరులున్నారు.