న్యూఢిల్లీ: గూగుల్ పే ద్వారా గోల్డ్ లోన్లను ఇచ్చేందుకు ముత్తూట్ ఫైనాన్స్‌తో గూగుల్ టై అప్ అయ్యింది. అంతేకాకుండా గురువారం నుంచి ఏఐ అసిస్టెంట్ జెమిని లైవ్ హిందీ, తెలుగుతో పాటు మరో ఏడు ఇండియన్ లాంగ్వేజ్‌లలో అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. గూగుల్ ఫర్ ఇండియా పదో ఎడిషన్‌లో ఈ ప్రకటనలు చేసింది. ప్రపంచంలోని మొత్తం గోల్డ్‌లో 11 శాతం ఇండియాలోనే ఉందని గూగుల్ ఇండియా ఎండీ రోమ దత్తా అన్నారు. గోల్డ్‌పై లోన్లను తమ ప్లాట్‌ఫామ్ ద్వారా తక్కువ వడ్డీకే పొందొచ్చని తెలిపారు. ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు కావొస్తున్న సందర్భంగా గూగుల్ తన ఫ్యూచర్ ప్లాన్స్‌ను ప్రకటించింది.
ఓపెన్ సోర్స్ జెమిని ఏజెంట్ ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకొస్తామని పేర్కొంది. ఇది అన్ని ఇండియన్ బిజినెస్‌లకు, యూజర్లకు అందుబాటులో ఉంటుందని, బిజినెస్‌లు తమ ప్రొడక్ట్‌లను ఇందులో లిస్టింగ్ చేసుకోవచ్చని, యూజర్లు తమకు నచ్చిన ప్రొడక్ట్‌లను కొనుక్కోవచ్చని, సర్వీస్‌లను పొందొచ్చని గూగుల్ వివరించింది. అంతేకాకుండా త్వరలో ఇండియాలో జెమిని ఫ్లాష్ 1.5 ని లాంచ్ చేస్తామని పేర్కొంది.
ALSO READ | మనక్సియాకు రూ.200 కోట్ల విలువైన ఆర్డర్