పాన్‌గల్, వెలుగు: వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలంలోని వెంగళాయిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి విష్ణువర్ధన్‌ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సస్పెండ్ చేసినట్లు ఎంపీడీవో గోవిందరావు తెలిపారు. గ్రామపంచాయతీ నిధులను అక్రమంగా వినియోగించారనే ఆరోపణలపై గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా పంచాయతీ అధికారి విచారణ జరిపారు.
పలు అవకతవకలు వెలుగులోకి రావడంతో నివేదిక ఆధారంగా కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు పడింది. సర్పంచ్ లేని సమయంలో గ్రామసభ తీర్మానాలు లేకుండానే నిధులు డ్రా చేయడం, ట్రాక్టర్‌కు నకిలీ ట్రిప్ షీట్లు చూపించడం, డీజిల్ బిల్లులను నకిలీవి తయారు చేయడం వంటి అక్రమాలు చేసినట్లు గుర్తించారు. గ్రామంలో కరెంట్ బల్బులు వేయకపోయినా వేసినట్టు నమోదు చేయడం, ఒకే పనికి రెండు సార్లు బిల్లులు రూపొందించి నిధులను దుర్వినియోగం చేసినట్లు తేలింది.

