గ్రామ పంచాయతీ ట్రాక్టర్ బోల్తా

 గ్రామ పంచాయతీ ట్రాక్టర్ బోల్తా
  • ట్రాక్టర్ డ్రైవర్ అడ్డూరి వంశి (23) మృతి

పెద్దపల్లి జిల్లా: మంథని మండలం శ్రీ రాంనగర్ కుచిరాజ్ పల్లి వద్ద ప్రధాన రహదారి పై  గ్రామ పంచాయతీ  ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. అక్కేపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ అడ్డూరి వంశీ (23) అనే యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను రిపేర్ కోసం గ్రామపంచాయతీ ట్రాక్టర్ లో మంథనికి తీసుకువెళ్తుండగా ప్రమాదం జరిగింది. అదుపుతప్పి రోడ్డుపక్కన పొదల్లో పడిపోయింది. స్థానికులు గుర్తించి సహాయక చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. తీవ్రంగా గాయపడిన ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.