రాయికోడ్, వెలుగు : రాయికోడ్‌లో గల శ్రీ రుక్మిణీ పాండురంగ ఆలయ13వ వార్షికోత్సవ వేడుకలుఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాయికోడ్ గ్రామస్తులతో పాటు పిపడ్ పల్లి, మహ్మదాపూర్, నల్లంపల్లి , నాగన్ పల్లి, హస్నాబాద్, సింగితం, రాయిపల్లి, కుస్నూర్ తదితర గ్రామాల భజన కళాకారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు కలశాలతో గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి ఉత్సవ విగ్రహాలకు జలాభిషేకం చేశారు. అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు అన్నదానం చేశారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కేథర్నాథ్పాటిల్, విఠల్, రాజు గౌడ్, సతీశ్ కులకర్ణి, లక్ష్మణ్, తుకారాం, సందీప్ గౌడ్, గణేశ్, నాగరాజ్, నారాయణ పంతులు, గోపాల్, తుకారాం, పాండు పాల్గొన్నారు.