
హైదరాబాద్: ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ , అదనపు డీజీపీ బి.శివధర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్రత్యం అనంతరం దేశ నిర్మాణంలో ఎందరో తమ ప్రాణాలను త్యాగం చేశారని.. వారిలో ఎంతో మంది పోలీసులు ఉన్నారన్నారు ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి. దేశ, రాష్ట్ర రక్షణలో ఇంటెలిజెన్స్ విభాగం పాత్ర ఎంతో కీలకం అని.. ఈ విషయంలో ఎంతో సమర్థవంతంగా పని చేస్తున్న సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారాయన.
ఈ కార్యక్రమంలో డీఐజీ కార్తికేయ, ఎస్ ఎస్పీ భాస్కరన్, శ్రీధర్,ఇతర అధికారులు పాల్గొన్నారు.