
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని పరిరక్షించి.. దాని అమలు కోసం ప్రయత్నం చేయడమే ప్రథమ కర్తవ్యమని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీ నగర్ డివిజన్ అరుంధతి నగర్ లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు కోదండరాం. జాతీయ స్థాయిలో రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రజలందరికీ ఉందని.. సమాన హక్కులను కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.