హైదరాబాద్​లో గోల్డెన్​ పెవిలియన్​

హైదరాబాద్​లో గోల్డెన్​ పెవిలియన్​

హైదరాబాద్​, వెలుగు:ఇండియన్​, చైనీస్​ వంటి ఎన్నో రుచులు అందించే విజయవాడకు చెందిన గోల్డెన్ పెవిలియన్​ హైదరాబాద్​లోనూ రెస్టారెంట్​ ప్రారంభించింది. సిటీలోని బంజారా​హిల్స్​ ఎమ్మెల్యే  కాలనీలో దీనిని ఏర్పాటు చేసింది. అత్యంత నాణ్యమైన మసాలాలు, బాస్మతీ బియ్యంతో తాము బిర్యానీలు, ఇతర వంటలు చేస్తామని సంస్థ ఎండీ సాజిద్​ మహ్మద్​ చెప్పారు. త్వరలో తాము అమరావతిలో కన్వెన్షన్​ సెంటర్​ను, పార్క్​ హయత్​ సహకారంతో త్రీస్టార్​ హోటల్​ను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు.