నెటిజన్స్​ ఫిదా: అమ్మమ్మపై ప్రేమతో మనవరాలు గిఫ్ట్

V6 Velugu Posted on Jul 19, 2021

మనవళ్లు, మనవరాళ్లకి గ్రాండ్​ పేరెంట్స్  బోలెడు బహుమతులు ఇస్తుంటారు. అయితే ఇక్కడ ఓ మనవరాలు తన అమ్మమ్మ కోసం ప్రేమగా 
ఒక కానుక తీసుకొచ్చింది. ఆ సర్​ప్రైజ్​ గిఫ్ట్​ ​ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్​ టాపిక్​ అయ్యింది. గిఫ్ట్​ చూశాక ఆ బామ్మ ఇచ్చిన క్యూట్​ ఎక్స్​ప్రెషన్స్​కి నెటిజన్స్​ ఫిదా అవుతున్నారు.

ఇంతకీ ఆ బాక్స్​లో ఏముందంటే..
బార్బీ డాల్​. బార్బీ గిఫ్ట్​ బామ్మకా?! అని ఆశ్చర్యపోకండి. బ్రెజిల్​ అనే ఈ బామ్మకి బార్బీలంటే భలే ఇష్టమట. చిన్నప్పట్నించీ వాటిని కొనుక్కోవాలని ఆశ కూడా. కానీ, ఏవేవో కారణాల వల్ల ఇప్పటివరకు ఆ కోరిక తీరలేదు. బామ్మ ఇష్టాన్ని గమనించిన తన మనవరాలు ఇలా బార్బీ గిఫ్ట్ ఇచ్చి సర్​ప్రైజ్​ చేసింది. ఆ బార్బీ డాల్​ చూడగానే బామ్మ సంతోషంతో గంతులేసింది.  బార్బీని ముద్దాడుతూ మనవరాలుకి థ్యాంక్యూ చెప్పింది. ఆ సర్​ప్రైజ్​ని 41 సెకన్ల వీడియోలో క్యాప్చర్​ చేసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసింది ఆ మనవరాలు. అది చూసిన నెటిజన్స్​ బామ్మ హ్యాపీనెస్​ చూసి ఫుల్​ ఖుష్​ అవుతున్నారు.

Tagged Gift, love, granddaughter, grandma

Latest Videos

Subscribe Now

More News