IPL 2024: అక్కడ కోహ్లీ ఆధిపత్యం లేదు.. అతన్ని ఎదుర్కోవడం కష్టమే: హర్భజన్ సింగ్

IPL 2024: అక్కడ కోహ్లీ ఆధిపత్యం లేదు.. అతన్ని ఎదుర్కోవడం కష్టమే: హర్భజన్ సింగ్

వ్యక్తిగత కారణాల రీత్యా ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లి.. ఐపీఎల్ 2024 కోసం సన్నద్దమవుతున్నాడు. బెంగళూరు అభిమానులకు అందని ద్రాక్షలా మిగిలిపోయిన టైటిల్ అందించడమే లక్ష్యంగా కఠిన సాధన చేస్తున్నాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సమరం మార్చి 22న తెరలేవనుంది. ఆర్‌సీబీ తొలి పోరులో.. చెన్నై, చెపాక్ స్టేడియం వేదికగా ధోని సేనతో తలపడనుంది. ఈ సమరానికి ముందు కోహ్లీ రికార్డులను ఉద్దేశిస్తూ భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

కోహ్లీ ఆర్‌సీబీకి ట్రోఫీ అందించనప్పటికీ, తన 16 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లో ఎన్నో వ్యక్తిగత రికార్డులు సృష్టించాడు. 237 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో కోహ్లీ 37.24 సగటుతో మొత్తం 7263 పరుగులు చేశాడు. టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2016లో ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు (976) నమోదు చేశాడు.5 ఐపీఎల్ సెంచరీలు నమోదు చేశాడు. చెప్పుకోవడానికి ఈ గణాంకాలు బాగానే ఉన్నా.. చెన్నై, చిదంబరం స్టేడియంలో అతని రికార్డులు గొప్పగా లేవన్నది హర్భజన్ మాట.

స్ట్రైక్-రేట్ 111

చెపాక్‌లో కోహ్లీ రికార్డులు గొప్పగా ఏమీ లేవు. సగటు 30గా ఉంటే, స్ట్రైక్-రేట్ 111గా ఉంది. అందునా సీఎస్కేపై 30 మ్యాచ్‌ల్లో 985 పరుగులు చేశాడు. ఈ విషయాన్ని హర్భజన్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగే మ్యాచ్ లో కోహ్లీ మెరుగైన ఆటతీరు ప్రదర్శించడం తప్పనిసరి అని హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు.

Also Read:బెంగళూరు బాధాకర ఓటమి.. స్పందించిన సూర్యకుమార్ యాదవ్

కప్ గెలుస్తారో లేదో నేను చెప్పలేను

"చెపాక్‌లో విరాట్ ఆధిపత్యం తగ్గింది. ఇప్పటివరకు కోహ్లీ అక్కడ ఐపిఎల్‌లో సెంచరీ చేయలేకపోయాడు. బ్యాటింగ్ చేయడానికి అదొక గమ్మత్తైన వేదిక. ప్రత్యేకించి టెన్నిస్ బాల్ రకంలా బౌన్స్‌ కనిపించదు. లో ఉంటుంది. ఆ అవకాశాలను చెన్నై బౌలర్లు బాగా ఉపయోగించుకుంటారు. ఉదాహరణకు సీఎస్కే గ్రేట్(రవీంద్ర) జడేజా బౌలింగ్ స్టంప్‌ టూ స్టంప్ చేస్తాడు. అతను బాల్‌ టర్న్ చేయడమే కాకుండా, తక్కువగా ఎత్తులో వెళ్లేలా చేస్తాడు. అక్కడ కోహ్లీ అతన్ని ధీటుగా ఎదుర్కోవాలి. 20 ఓవర్లు బ్యాటింగ్ చేయగలిగినప్పుడే ఆర్‌సీబీని గెలిపించగలడు. అతను , రాణిస్తేనే వారి జట్టు ముందుకు సాగుతుంది. కప్ గెలుస్తారో లేదో నాకు తెలియదు.." అని హర్భజన్ స్టార్ స్పోర్ట్స్‌తో అన్నారు.

ఆర్‌సీబీ షెడ్యూల్

  • మార్చి 22న: చెన్నై సూపర్ కింగ్స్‌తో
  • మార్చి 25న: పంజాబ్ కింగ్స్‌తో
  • మార్చి 29న: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో
  • ఏప్రిల్ 02న: లక్నో సూపర్ జెయింట్స్ తో
  • ఏప్రిల్ 06న: రాజస్థాన్ రాయల్స్ తో