
న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్ లోన్లు ఇచ్చే క్రెడిలా ఫైనాన్షియల్ సర్వీసెస్, శ్రీ లోటస్ డెవలపర్స్ రియాల్టీ, యూరో ప్రతీక్ సహా ఏడు కంపెనీల ఐపీఓలకు సెబీ అనుమతి ఇచ్చింది. కాలిబర్ మైనింగ్ అండ్ లాజిస్టిక్స్, జారో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్, జెసన్స్ ఇండస్ట్రీస్ జెమ్, అరోమాటిక్స్ ఐపీఓలకు కూడా ఆమోదం వచ్చింది.
ఈ సంస్థలు కనీసం రూ. 3,000 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఈ కంపెనీలు ఐపీఓ కోసం డాక్యుమెంట్లను అందజేశాయి. ఈ నెల 13–-16 తేదీలలో సెబీ తన అబ్జర్వేషన్లను జారీ చేసింది.
సెబీ పరిభాషలో వీటిని జారీ చేయడమంటే పబ్లిక్ఇష్యూకు అనుమతి వచ్చినట్టే! ఈ ఏడు కంపెనీల షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్అవుతాయి.