
న్యూఢిల్లీ: ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఐపీఓకి వచ్చేందుకు సెబీ నుంచి అనుమతులు పొందింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.5,500 కోట్ల విలువైన ఫ్రెష్ షేర్లను అమ్మనుంది. ఆఫర్ ఫర్ సేల్ కింద 9.52 కోట్ల షేర్లను షేర్ హోల్డర్లు విక్రయించనున్నారు. ఈ ఫండ్స్‌లో మెజార్టీ వాటాను బ్యాటరీ సెల్స్ తయారీని విస్తరించడానికి, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు వాడతామని కంపెనీ పేర్కొంది. అలానే బెయిన్ క్యాపిటల్‌కు వాటాలున్న ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ కూడా ఐపీఓకి వచ్చేందుకు సెబీ అనుమతులు పొందింది. ఈ కంపెనీ ఫ్రెష్ షేర్ల ఇష్యూ ద్వారా రూ.800 కోట్లను సేకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ కింద 1.36 కోట్ల షేర్లను షేర్ హోల్డర్లు అమ్మనున్నారు. మరోవైపు ఆఫీసర్స్ ఛాయిస్ వంటి విస్కీ బ్రాండ్లను అమ్మే అలైడ్ బ్లెండర్స్ ఐపీఓ ఈ నెల 25–27 మధ్య ఓపెన్‌లో ఉంటుంది. ఒక్కో షేరుని రూ.267–281 రేంజ్‌లో అమ్మనున్నారు. ఐపీఓ ద్వారా రూ. 1,500 కోట్లను కంపెనీ సేకరించనుంది.