షాకింగ్ వీడియో: తాళికట్టిన వెంటనే.. పెళ్లి కొడుకును కత్తితో పొడిచాడు.. 2 కిలోమీటర్లు వెంటాడిన డ్రోన్ కెమెరా

షాకింగ్ వీడియో: తాళికట్టిన వెంటనే.. పెళ్లి కొడుకును కత్తితో పొడిచాడు.. 2 కిలోమీటర్లు వెంటాడిన డ్రోన్ కెమెరా

రెండు మనసులు ఒక్కటవుతున్న వేళ.. అంగరంగ వైభవంగా జరుగుతున్న పెళ్లి వేడుకల్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. డీజే దగ్గర మొదలైన వివాదంలో పెళ్లికొడుకును పొడిచి పారిపోయారు దుండగులు. దీంతో అక్కడున్న సందడి కాస్త విషాదంగా మారింది. అయితే డ్రోన్ తో నిందితులను వెంటాడిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని అమరావతి లో 2025 నవంబర్ 10వ తేదీన జరిగింది ఈ ఘటన. పెళ్లితంతు పూర్తయ్యాక.. డీజే డ్యాన్సులతో ఊరంతా కోలాహలంగా ఉన్న వేళ పెళ్లికొడుకు సుజల్ రామ్ సముద్ర (22) ను పొడిచాడు రఘు జితేంద్ర భక్షి అనే వ్యక్తి. పెళ్లి కొడుకు దగ్గరికి చేరుకున్న దుండగుడు కడుపులో మూడు పోట్లు పొడిచాడు. అదే విధంగా తొడలపై, మోకాళ్లపై కూడా గాయపర్చాడు. 

వెంటాడిన డ్రోన్ కెమెరా:

ఈ ఇన్సిడెంట్ మొత్తం డ్రోన్ కెమెరాలో రికార్డు అయ్యింది. అప్పటి వరకు ఉన్న హంగామా ఒక్కసారిగా అల్లర్లతో, అరుపులతో కనిపించింది. కెమెరామెన్ వీడియో అంతా రికార్డు చేశాడు. అంతే కాకుండా పొడిచి పారిపోతున్న వ్యక్తిని ఫాలో అయ్యింది డ్రోన్. నిందితుడితో పాటు వచ్చిన మరో వ్యక్తి బైక్ పై వెయిట్ చేస్తుండగా.. పొడిచిన వ్యక్తి వెళ్లి  బైక్ ఎక్కాడు. డ్రోన్ ఫాలో అవటం చూసి స్పీడ్ పెంచారు. అయినా డ్రోన్ ఆపరేటర్ దాదాపు రెండు కిలోమీటర్ల మేర వెంటాడి నిందితులకు సంబంధించిన ఎవిడెన్స్ దొరకడంలో కీలక పాత్ర పోషించాడు. 

డ్రోన్ ఆపరేటర్ తీసిన వీడియో పోలీసులకు కీ ఎవిడెన్స్ గా ఉపయోగపడినట్లు చెప్పారు. దుండగులు వెళ్లిన రూట్ ను ట్రాక్ చేస్తున్నారు. ఆ రూట్ లో ఉన్న సీసీటీవీ కెమెరాల ద్వారా పట్టుకోవడం సులువు అవుతుందని చెబుతున్నారు పోలీసులు. 

డ్రోన్ కెమెరా తీసిన వీడియో ఇద్దరు దుండగులు పెళ్లి స్టేజ్ దగ్గరకు వచ్చి పొడిచి పారిపోతారు. అందులో ఆరెంజ్ కలర్ టీషర్ట్ వేసుకున్న వ్యక్తి బైక్ స్టార్ట్ చేయగా.. బ్లాక్ టీషర్ట్ వేసుకున్న వాడు వెంటపడ్డ వారిని కత్తితో బెదిరించి బైక్ ఎక్కుతాడు. పెళ్లికొడుకును పొడిచినప్పుడు అతని తండ్రి అడ్డుకోడానికి చూస్తే.. అతన్ని కూడా గాయపరిచి పారిపోయారు దుండగులు. 

పొడిచిన వ్యక్తి ఎవరు..?

పెళ్లికి వచ్చిన వ్యక్తి ఎవరూ పెళ్లికొడుకును చంపాలనుకోరు. ప్రీప్లాన్డ్ గా నే హత్యాయత్నానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. చిన్న తోపులాటకు కత్తితో ఎందుకు పొడుస్తారు..? పెళ్లికి వచ్చేవాళ్లు కత్తితో ఎందుకు వస్తారు..? దీని వెనుక ఏదో కుట్ర ఉన్నట్లు చెబుతున్నారు. నిందితులు దొరికితే గానీ అసలు నిజం బయటపడదని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.