
పరిగి, వెలుగు: పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండలానికి చెందిన ఇద్దరు గ్రూప్ 1లో ఉత్తీర్ణులై ఇద్దరిని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అభినందించారు. కుల్కచర్ల కు చెందిన మౌనిక మేడ్చల్ జిల్లా సబ్ రిజిస్ట్రార్‌గా, కుల్కచర్ల మండలం తిరుమలపూర్ గ్రామానికి చెందిన మారుతి మున్సిపల్ కమిషనర్‌గా ఎంపికై నియామకపత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా శనివారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.