ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ పీడీలుగా గ్రూప్ 1 ఆఫీసర్లు

ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్  పీడీలుగా గ్రూప్ 1 ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కు హౌసింగ్​ ప్రాజెక్టు డైరెక్టర్లు (పీడీ)గా  గ్రూప్ 1 అధికారులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరీంనగర్ కు రాజేశ్వర్, కొత్తగూడెంకు రవీంద్రనాథ్​, ఆసిఫాబాద్ కు శ్రీరాములు, మహబూబాబాద్ కు హనుమ, గద్వాలకు శ్రీనివాసరావు, నిజామాబాద్ కు పవన్ కుమార్​ను నియమించింది. ఇటీవల ఈ ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లను రెవెన్యూ శాఖ సెక్రటరీ లోకేశ్​ కుమార్ రిలీవ్ చేసి హౌసింగ్ కార్పొరేషన్ లో డిప్యూటేషన్ పద్ధతిలో పనిచేయాలని ఉత్తర్వులు ఇచ్చారు.

 ఇదే క్రమంలో వీరిని పీడీలుగా నియమిస్తూ  హౌసింగ్ శాఖ సెక్రటరీ, హౌసింగ్​ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ శనివారం జీవో జారీ చేశారు. కాగా, మరో 3 జిల్లాలకు హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్లను కూడా నియమిస్తూ ఇంకో ఉత్తర్వు విడుదల చేశారు. ఇందులో సూర్యాపేటకు జీహెచ్ ఎంసీలో ఈఈగా పనిచేస్తున్న సిద్దార్థను, సిరిసిల్లకు శంకర్​ను, వనపర్తికి వితోబాను నియమించారు.