టీఎస్పీఎస్సీకి వద్దు.. యూపీఎస్సీకి అప్పగించండి

టీఎస్పీఎస్సీకి వద్దు.. యూపీఎస్సీకి అప్పగించండి

గ్రూప్ 1 (Group 1)లో క్వాలిఫై అయిన మాకు అన్యాయం జరిగింది అని గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంప్లీట్ అయిన అభ్యర్థులు ఓయూ (OU University) ఆర్ట్స్ కళాశాల ఎదుట నిరసనకు దిగారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్న తమకు  టీఎస్పీఎస్సీ (TSPSC) అన్యాయం చేసిందని మండిపడ్డారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించడాన్ని తప్పు పట్టారు. 

జూన్ లో నిర్వహిస్తామన్న పరీక్షను టీఎస్పీఎస్సీకి కాకుండా యూపీఎస్సీ(UPSC)కి అప్పగించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదించారు. న్యాయం జరుగకుంటే ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. టీఎస్పీఎస్సీ మీద తమకు నమ్మకం లేదన్నారు బాధితులు. టీఎస్పీఎస్సీ నిర్వహించే అన్ని పరీక్షలను యూపీఎస్సీకి అప్పగించాలని తెలిపారు.