
న్యూఢిల్లీ: వాగన్‌ఆర్, ఆల్టో కే10, సెలెరియో, ఈకో వంటి మోడళ్లలో ఇక నుంచి ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ఎక్విప్మెంట్గా అందిస్తామని మారుతి సుజుకి ఇండియా సోమవారం తెలిపింది. అన్ని రకాల సెగ్మెంట్ల కార్లకు భద్రత పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. రోడ్లు వేగంగా విస్తరిస్తున్నందున కార్లలో మరింత భద్రత అవసరం ఉందని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) పార్థో బెనర్జీ అన్నారు. కంపెనీ తన అరీనా షోరూముల్లో వాగన్ ఆర్, ఆల్టో కె10, సెలెరియో, ఈకో వంటి మోడళ్లను అమ్ముతోంది.