నేనున్నాను.. ధైర్యంగా ఉండండి: గడ్డం వంశీకృష్ణ

నేనున్నాను.. ధైర్యంగా ఉండండి: గడ్డం వంశీకృష్ణ

మల్హర్, (కాటారం) వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ఇటీవల ఇసుక లారీ ఢీకొని ధన్వాడ గ్రామానికి చెందిన తులసెగారి రాజలింగు(55) అనే వ్యక్తి మృతి చెందారు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం ధన్వాడ గ్రామానికి వెళ్లి రాజలింగు కుటుంబాన్ని పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని రాజలింగు కుటుంబాన్ని ఓదార్చారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకునేందుకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. 

అలాగే.. కాటారం సబ్ స్టేషన్ పల్లికి చెందిన తోట రవి ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో  తన రెండు కాళ్లు కోల్పోయారు. దాంతో తోట రవిని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ పరంగా తాను సాయం అందించేలా కృషి చేస్తానని ఎంపీ ధైర్యం చెప్పారు.