గ్రూప్-3 ద‌ర‌ఖాస్తుల స‌వ‌ర‌ణ‌కు అవ‌కాశం క‌ల్పించిన టీఎస్పీఎస్సీ

గ్రూప్-3 ద‌ర‌ఖాస్తుల స‌వ‌ర‌ణ‌కు అవ‌కాశం క‌ల్పించిన టీఎస్పీఎస్సీ

రాష్ట్రంలో గ్రూప్-3 ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వివరాలను ఎడిట్‌ చేసుకొనేందుకు TSPSC అవకాశం కల్పించింది. ఆగస్టు 16 నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు అభ్యర్థులు త‌మ ద‌ర‌ఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే.. ఎడిట్ చేసుకోవ‌చ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది. టీఎస్పీఎస్సీ అఫిషియల్ వెబ్సైట్ లో మరిన్ని వివరాలు ఉన్నాయని పేర్కొంది. వివరాలు తప్పుగా ఎంట్రి చేసిన అభ్యర్థులు TSPSC అఫీషియల్ వెబ్ సైట్ లో తప్పులు సరి చేసుకోవాలని పేర్కొంది.  

రాష్ట్రంలోని వివిధ శాఖల్లో గ్రూప్‌-3 కేటగిరీలో 1,375 ఉద్యోగాల భర్తీకి గతేడాది(2022) డిసెంబర్‌ 30న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గ్రూప్‌-3లో కొత్తగా మరో 13 ఉద్యోగాలను జతచేస్తూ.. ఈ ఏడాది(2023) జూన్ నెల‌లో టీఎస్‌పీఎస్సీ ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం.. ఇరిగేషన్‌ విభాగం, ఐ అండ్‌ కాడ్‌లో కొత్తగా మరో 13 ఉద్యోగాలను జత చేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. కొత్తగా కలిపిన ఉద్యోగాలతో కలిపితే మొత్తం గ్రూప్‌-3 ఉద్యోగాల సంఖ్యం 1388కి పెరిగింది.