తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రూప్ 1 లో మరో 60 పోస్టులు పెంపు

 తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రూప్ 1 లో మరో 60 పోస్టులు పెంపు

 తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 పోస్టుల భర్తీ పై కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 1 పోస్టులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 పోస్టుల్లో మరో 60 పోస్టులను పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబందించి ప్రభుత్వం 503 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల ఆ నోటిఫికేషన్ ను రద్దు చేసింది. ఇవాళ సమీక్ష జరిపిన అధికారులు గ్రూప్ 1 పోస్టులను 563కు పెంచుతున్నట్లు ప్రకటించారు.