TSPSC గ్రూప్​ 1 దరఖాస్తుల గడువు పెంపు... ఎప్పటివరకంటే...

TSPSC గ్రూప్​ 1 దరఖాస్తుల గడువు పెంపు... ఎప్పటివరకంటే...

గ్రూప్-1 దరఖాస్తుల గడువును మరో రెండు రోజులు పొడిగిస్తూ టిఎస్పిఎస్సీ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి దరఖాస్తులకు గురువారం ( మార్చి 14)  చివరి రోజు కాగా ఈ గడువును శనివారం ( మార్చి 16) సాయంత్రం ఐదు గంటలవరకూ పొడిగించారు. అభ్యర్థులనుంచి వచ్చిన డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని టిఎస్పీఎస్సీసి ఈ నిర్ణయం తీసుకుంది. చివరిరోజు టీఎస్పీఎస్సీ సర్వర్ పనిచేయకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే గడువును పొడిగించడంతో వారు తేలిగ్గా ఊపిరితీసుకున్నారు. మొత్తం 563 పోస్టులకు గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వగా, ఇప్పటివరకూ పోస్టులకు 2.70 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు.

 డిగ్రీ అర్హత ఉన్నవారు గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే గతంలో టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్ (Notification No. 04/2022 Dt. 26/04/2022) సమయంలో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేదు. ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరంలేదు.

అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.320 చెల్లించాలి. ఇందులో అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు కింద రూ.200, పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి, ప్రభుత్వ ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. మే/జూన్ నెలల్లో ప్రిలిమ్స్(ఆబ్జెక్టివ్) పరీక్ష, సెప్టెంబరు/అక్టోబరు నెలల్లో మెయిన్ (కన్వెన్షనల్) పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలకు వారం ముందు నుంచి హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచుతారు. పరీక్ష సమయానికి 4 గంటల ముందువరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21నుంచి నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది.