హైదరాబాద్, వెలుగు: ఆక్వాకల్చర్ ఫీడ్‌లు, ఆక్వా హెల్త్‌కేర్ సీఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ గ్రోవెల్ పెంపుడు జంతువుల ఆహార బ్రాండ్ "కార్నివెల్"ను తీసుకొచ్చింది. దీనితో పెంపుడు జంతువుల ఆహార రంగంలోకి ప్రవేశించింది.
కుక్కపిల్లలు, పిల్లిపిల్లల నుంచి పెద్ద జంతువుల వరకు పోషకమైన, రుచికరమైన, ఆహారాన్ని అందిస్తామని ప్రకటించింది. వీటిలో అంటార్కిటిక్ క్రిల్, ఆల్గల్ ఆయిల్, కీలకమైన ప్రొటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, స్పైరులినా పోషకాలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది.
శాకాహార పెంపుడు జంతువులకు కూడా ఆహారాన్ని తీసుకొచ్చింది. గ్రోవెల్ ప్రమోటర్ గ్రూప్‌కు చెందిన కార్తీక్ మాట్లాడుతూ తమ ప్రొడక్టుల ధరలు రూ.ఐదు వందల్లోపే ఉంటాయని చెప్పారు. నెల్లూరులో తమకు ప్లాంటు ఉందని, ప్రస్తుతం 46 ప్రొడక్టులు అమ్ముతున్నామని, 4వేలకుపైగా ఔట్లెట్ల ద్వారా వీటిని కస్టమర్లకు చేర్చుతామని చెప్పారు.