అనర్హులకు గృహలక్ష్మి ఎట్లిస్తరు? .. మహిళల ఆందోళన

అనర్హులకు గృహలక్ష్మి ఎట్లిస్తరు? .. మహిళల ఆందోళన

గన్నేరువరం, వెలుగు: కరీంనగర్  జిల్లా గన్నేరువరం మండలంలో గృహలక్ష్మి పథకంలో అనర్హులను ఎంపిక చేశారంటూ మహిళలు శనివారం తహసీల్దార్  కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. గన్నేరువరం గ్రామంలో గృహలక్ష్మి పథకం ఎంపికలో సగం మందికిపైగా సొంత ఇండ్లు ఉన్నాయని వారు చెప్పారు.

 

Also Raed :- దుబాయ్ నుంచి వచ్చి మర్డర్ చేసి మళ్లి అక్కడికే పారిపోయిండు

మరికొందరికి రెండు ఇండ్లు, మరికొందరు కొత్త ఇండ్లు కట్టుకొని  గృహప్రవేశం చేశారని, అలాంటి వారికి  కూడా గృహలక్ష్మి పథకం అమలు చేశారని వాపోయారు. గుడిసెలో నివసిస్తున్న తమ లాంటి వారిని పథకానికి ఎంపిక చేయకుండా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫైనల్  చేసిన లిస్టును రద్దుచేసి మళ్లీ గ్రామసభ ద్వారా ఎంపిక చేయాలని డిమాండ్  చేశారు. లేకపోతే రసమయిని మండలంలో తిరగనివ్వమని హెచ్చరించారు.