జీఎస్టీ కలెక్షన్ తగ్గింది: సెప్టెంబర్ లో 91 వేల కోట్ల వసూలు

జీఎస్టీ కలెక్షన్ తగ్గింది: సెప్టెంబర్ లో 91 వేల కోట్ల వసూలు
  • ఆగస్టులో వచ్చిన దానికన్నా 2.67 శాతం తక్కువ

న్యూఢిల్లీ: సెప్టెంబరు నెలలో వచ్చిన జీఎస్టీ కలెక్షన్ ను మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. గడిచిన నెల రోజుల్లో రూ.91,916 కోట్ల జీఎస్టీ వచ్చినట్లు తెలిపింది. ఇందులో సీజీఎస్టీ ద్వారా 16,630 కోట్లు, ఎస్ జీఎస్టీ – రూ.22598 కోట్లు, ఐజీఎస్టీ రూపంలో రూ.45,069 కోట్లు (దిగుమతులపై వచ్చిన పన్ను రూ.22,097 కోట్లతో కలిపి) వసూలయ్యాయి. సెస్ రూపంలో మరో రూ.7620 కోట్లు వచ్చాయి.

తగ్గిన జీఎస్టీ రాబడి

సెప్టెంబరు నెలలో జీఎస్టీ రాబడి తగ్గింది. ఆగస్టుతో పోలిస్తే 2.67 శాతం  తక్కువగా జీఎస్టీ వసూలైంది. ఆగస్టులో రూ.98,202 కోట్ల జీఎస్టీ కలెక్ట్ అయింది. గత ఏడాది సెప్టెంబరు నెలతో పోల్చినా కూడా ప్రస్తుతం వచ్చిన మొత్తం తక్కువే. నిరుడు ఇదే నెలలో 94,442 కోట్ల రూపాయలు జీఎస్టీ రూపంలో వసూలైంది.