జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్నయ్

జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్నయ్

ఏడు నెలల్లో రూ.18 వేల కోట్లు దాటినయ్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జీఎస్టీ (గూడ్స్‌‌ అండ్ సర్వీస్ ట్యాక్స్‌‌) వసూళ్లు పెరుగుతున్నాయి. పోయినేడాది కరోనా లాక్‌‌డౌన్ కారణంగా తగ్గిన
వసూళ్లు ఈ ఏడాది మెరుగవుతున్నాయి. 2017లో జీఎస్టీ అమలులోకి వచ్చింది. ఆ ఏడాది రూ.3,505 కోట్లుగా ఉన్న మంత్లీ యావరేజ్‌‌.. ప్రతి ఏడాది
సుమారుగా రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు పెరుగుతోంది. కేంద్రం జీఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేస్తుండడంతో ఆదాయం కోల్పోతున్నామని
చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. జీఎస్టీ వసూళ్ల ద్వారా రాష్ట్రానికి ఎంత వరకు ఆదాయం పెరిగిందనే విషయాన్ని చెప్పడంలేదనే విమర్శలు
వినిపిస్తున్నయి. జీఎస్టీ అమలులోకి రాక ముందు రాష్ట్ర ఆదాయం మంత్లీ యావరేజ్ 2015-–16లో రూ.2,593 కోట్లు, 2016–17లో రూ.2,936
కోట్లుగా ఉండేది. 

ఈ ఏడాదిలో ఇప్పటిదాకా వసూళ్లు ఇలా..
ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్ ​చివరికి రాష్ట్ర జీఎస్టీ రూ.18 వేల కోట్లు దాటింది. ఈ ఏడాది రూ.35 వేల కోట్ల వసూళ్లను సర్కారు టార్గెట్‌‌గా పెట్టుకుంది.
ఏప్రిల్‌‌లో రూ.2,697 కోట్లు, మే నెలలో రూ.1,628 కోట్లు, జూన్‌‌లో రూ.1,788 కోట్లు, జులైలో రూ.2,189 కోట్లు, ఆగస్టులో రూ.2,619 కోట్లు,
సెప్టెంబర్‌‌‌‌లో రూ.3,500 కోట్లు, అక్టోబర్‌‌‌‌లో రూ.3,854 కోట్లు వచ్చింది. కాగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా మే, జూన్‌‌ నెలల్లో వసూళ్లు కొంతమేర
తగ్గినా.. జులై నుంచి పెరుగుతున్నాయి.