మార్చిలో జీఎస్టీ వసూళ్లు..రూ. 1.78 లక్షల కోట్లు

మార్చిలో జీఎస్టీ వసూళ్లు..రూ. 1.78 లక్షల కోట్లు

న్యూఢిల్లీ :  ట్రాన్సాక్షన్లు పెరగడంతో ఈ ఏడాది మార్చిలో జీఎస్టీ వసూళ్లు 11.5 శాతం పెరిగి రూ. 1.78 లక్షల కోట్లకు చేరుకున్నాయి.   గత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2023–-మార్చి 2024) స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 20.14 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో వసూళ్ల కంటే 11.7 శాతం ఎక్కువ.

2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి  నెలవారీగా సగటు స్థూల వసూళ్లు రూ. 1.68 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రికార్డయిన సగటు రూ. 1.5 లక్షల కోట్లను అధిగమించింది.  

ఈ ఏడాది మార్చిలో  గ్రాస్​ జీఎస్టీ  ఆదాయం 11.5 శాతం వార్షిక వృద్ధితో రూ. 1.78 లక్షల కోట్లతో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిందని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది.