
- జీఎస్టీ రాకతో పెరిగిన అవసరం
- ఈ ఏడాది 3,815 మందికి జాబ్స్
- గతేడాదితో పోలిస్తే రెట్టింపు
- హయ్యెస్ట్ జీతం ఏడాదికి 36 లక్షలు
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం అమల్లోకిరావడం, దేశంలో ఆర్థిక ప్రగతి వేగం పుంజుకోవడంతో అన్నిరకాల కంపెనీలకు చార్టెడ్ అకౌంటెంట్ల(సీఏ)ల అవసరం వచ్చి పడింది . దేశవ్యాప్తంగా చిన్నాపెద్ద కంపెనీలు వీళ్ల కోసం పోటీ పడుతున్నాయి.దీంతో సీఏలకు డిమాండ్ పెరిగింది . డిమాండ్ పెరగడంతో శాలరీలు పెరిగాయి. గతేడాదితో పోలిస్తే రెండిం తలయ్యాయి. దేశంలోని ప్రొఫెషనల్ అకౌంటింగ్ సంస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఈ వివరాలు వెల్లడించింది . ఇన్‌స్టిట్యూషన్ ప్రారంభించినప్పటి నుంచి ఈసారే ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకున్నారని చెప్పింది .
గతేడాదికి డబుల్
ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో దేశవ్యాప్తంగా 17 సెంటర్లలో ఐసీఏఐ ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించగా 9,011 మంది అర్హత సాధించిన సీఏలు రిజిస్టర్ చేసుకోగా 3,815 మందికి ఉద్యోగాలొచ్చాయి.3,180 మందిలో 730 మందికి ఏడాదికి రూ.9 లక్షల ప్యాకేజీ ఆఫర్ చేశారు. సుమారు 55 శాతం మందికి రూ.7.5 లక్షల నుంచి రూ.9 లక్షల జీతం పొందారు.అయితే గతేడాదితో పోలిస్తే ఉద్యోగాల సంఖ్య పెరిగినా జీతం మాత్రం కాస్త తగ్గింది . 2018లో సగటు జీతం రూ.8.4 లక్షలు. అదే ఈ ఏడాది రూ.7.43 లక్షలు. అయితే ఎక్కువ జీతం మాత్రం గతేడాది కన్నాపెరిగింది . 2018లో రూ.18.5 లక్షల జీతాన్ని ఆఫర్ చేయగా ఈసారి రూ. 36 లక్షలు అత్యధిక జీతం.
బ్యాంకింగ్ లోనూ డిమాండ్
దేశవ్యాప్తంగా అన్ని రంగాలకు చెంది న 139కంపెనీలు సీఏలను నియమించు కోవడానికి వచ్చాయని ఐసీఏఐ చెప్పింది . యాక్సెంచర్, ఆల్స్‌టామ్,బార్క్‌లేస్ గ్లో బల్ సర్వీసెస్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్,ఐటీసీ, ఏఎన్‌ఐ టెక్నాలజీస్ (ఓలా)లతో పాటు అనేక టాప్ కంపెనీలు సీఏలను హైర్ చేసుకున్నాయంది. ఉద్యోగాల కోసం రిజిస్టర్ చేసుకున్న వారిలో గతేడాది 42 శాతం మంది జాబ్స్ పొందితే ఈసారి అది 57 శాతానికి పెరిగిందని చెప్పింది . బ్యాంకింగ్ రంగంలోనూ సీఏలకు మంచి డిమాండ్ ఉందని వివరించింది . కంపెనీల చట్టం లో ఎప్పటికప్పుడు కొత్త మార్పులు చేస్తుండటం, పన్నుల్లో కొత్త సంస్కరణలు తీసుకొస్తుండటంతో సీఎల అవసరం పెరిగిందని సీఐఈఎల్ హెచ్ ఆర్ సర్వీసెస్ డైరెక్టర్, సీఈవో ఆదిత్య నారాయణ మిశ్రా చెప్పారు . ఐసీఏఐ ప్లేస్‌మెంట్ ప్రాసెస్ 1995లో ప్రారంభమైంది . 2006 నుంచి 2018 మధ్య సుమారు 30 వేల మంది సీఏలు ఉద్యోగాలు పొందారు.