ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనున్న జీఎస్టీ కౌన్సిల్ 

ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనున్న జీఎస్టీ కౌన్సిల్ 
  • రాష్ట్రాలకు పరిహారం కొనసాగించడం పై కూడా​..

న్యూఢిల్లీ: ఆన్​లైన్​ గేమింగ్, కాసినోలపై పన్ను విధింపు, రాష్ట్రాలకు కాంపెన్సేషన్​ కొనసాగింపు వంటి అంశాలపై జీఎస్​టీ కౌన్సిల్​ బుధవారం నిర్ణయం తీసుకోనుంది. కాసినోలు, రేస్​కోర్సులు, ఆన్​లైన్​ గేమింగ్​పై 28 శాతం జీఎస్​టీ వసూలు చేయాలనే నిర్ణయానికి కౌన్సిల్​ వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని వస్తువులు, సేవలపై పన్ను రేట్లలో మార్పులను సిఫారసు చేస్తూ మినిస్టర్ల గ్రూపు ఇచ్చిన రిపోర్టును మంగళవారం నాటి సమావేశంలో కౌన్సిల్​ ఆమోదించింది.

జీఎస్​టీ సిస్టమ్​లో కొన్ని మార్పులను సూచించిన మరో మినిస్టర్ల కమిటీ రిపోర్టునూ కౌన్సిల్​ అంగీకరించింది. బుధవారం నాటి మీటింగ్​ తర్వాత జీఎస్​టీ కౌన్సిల్​ ఛైర్మన్​, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ మీడియాతో మాట్లాడతారు. జీఎస్​టీని అమలులోకి తెచ్చినప్పుడు రాష్ట్రాలకు ఏర్పడే పన్ను నష్టాన్ని భర్తీ చేయడానికి పరిహారాన్ని అయిదేళ్లపాటు చెల్లించాలని నిర్ణయించారు. ఈ అయిదేళ్లు జూన్​ 30 తో ముగియనుంది. దీంతో పరిహార​ చెల్లింపులను మరి కొంత కాలం కొనసాగించాలని కొన్ని రాష్ట్రాలు పట్టుపడుతున్నాయి. కొన్ని రాష్ట్రాలైతే ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్టులు కూడా పంపించాయి.