రూ.3 వేల కోట్లు తగ్గిన GST వసూళ్లు

రూ.3 వేల కోట్లు తగ్గిన GST వసూళ్లు

న్యూఢిల్లీ : GST వసూళ్లు ఫిబ్రవరి నెలలో రూ.97,247 కోట్లకు తగ్గాయి. ఇవి జనవరిలో రూ.1.02 లక్షల కోట్లు. జనవరి నుంచి ఫిబ్రవరి చివరి వరకు 73.48 సేల్స్ రిటర్నులు దాఖలయ్యాయి. ‘2019 ఫిబ్రవరి నెలలో స్థూలంగా మొత్తం వసూలైన GST రెవెన్యూ రూ.97,247 కోట్లు. దీనిలో కేంద్ర GST రూ.17,626 కోట్లుగా, రాష్ట్రాల GST రూ.24,192 కోట్లుగా, ఇంటి గ్రేటెడ్ GST రూ.46,953 కోట్లు గా, సెస్ రూ.8,476 కోట్లుగా ఉంది’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో GST రూపంలో వసూలైన మొత్తం రెవెన్యూలు రూ.10.70 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం రూ.13.71 లక్షల కోట్ల GST వసూళ్లు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, ఈ టార్గెట్‌‌ను రూ.11.47 లక్షల కోట్లకు కుదించింది.