12వేల కోట్ల జీఎస్టీ కట్టాల్సి ఉందంటున్నారు..ఎప్పుడు వసూలు చేస్తారు?

12వేల కోట్ల జీఎస్టీ కట్టాల్సి ఉందంటున్నారు..ఎప్పుడు వసూలు చేస్తారు?

హైదరాబాద్, వెలుగు: మేఘా కృష్ణారెడ్డి రూ.70 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, అలాగే రూ.12 వేల కోట్ల జీఎస్టీ కట్టాల్సి ఉందని స్వయంగా జీఎస్టీ అధికారులు  చెబుతున్నా సీఎం కేసీఆర్ ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వైఎస్ ఆర్​టీపీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు.  “మీ ఇద్దరు (కేసీఆర్​, కృష్ణారెడ్డి) తోడు దొంగలనా? రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చేపట్టినా కృష్ణారెడ్డికే ఎందుకు ఇస్తున్నారు?  తెలంగాణ వాళ్లకి కాంట్రాక్ట్ పనులు చేయడం రాదా? లేక మీ ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని దోచుకోవచ్చనా? ఈ విషయంపై బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు? కృష్ణారెడ్డి మీకు (సంజయ్, రేవంత్) కూడా దోస్తు. మీకూ ముడుపులు అందుతున్నాయి. అందుకే మాట్లాడడం లేదా” అని షర్మిల ట్విటర్​లో ప్రశ్నించారు.