ఆగస్టులో రూ.3,871 కోట్ల జీఎస్టీ రాబడి

ఆగస్టులో రూ.3,871 కోట్ల జీఎస్టీ రాబడి

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. ఆగస్టులో రూ.3,871 కోట్ల రాబడి వచ్చింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 10 శాతం గ్రోత్ ఉందని కేంద్రం ఆర్థిక శాఖ వెల్లడించింది. కిందటి ఏడాది ఆగస్టులో రూ.3,526 కోట్లు వసూలు కాగా, ఈసారి దాదాపు రూ.350 కోట్ల వృద్ధి కనిపించింది. ఇక దేశవ్యాప్తంగా ఆగస్టు నెలలో రూ.1,43,612 కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. ఇందులో రూ.24,710 కోట్లు సీజీఎస్టీ, రూ.30,951 కోట్లు ఎస్‌‌జీఎస్టీ, రూ.77,782 కోట్లు ఐజీఎస్టీ, రూ.10,168 కోట్లు సెస్ రూపంలో వసూలైనట్లు కేంద్రం తెలిపింది. గతేడాది ఆగస్టుతో పోలిస్తే.. దాదాపు 28 శాతంగా గ్రోత్ నమోదైనట్లు వెల్లడించింది. అలాగే వరుసగా ఆరునెలల్లో నెలవారీ జీఎస్టీ వసూళ్లు రూ.1.4 లక్షల కోట్ల మార్క్‌‌ను దాటినట్లు పేర్కొంది.