జీఎస్టీ వసూళ్లపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది: కేంద్రం

జీఎస్టీ వసూళ్లపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది: కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా దేశ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) వసూళ్లు గణనీయంగా తగ్గాయని రెవెన్యూ సెక్రటరీ కౌన్సిల్ తెలిపింది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం 41వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ‘జీఎస్టీ కలెక్షన్‌పై కరోనా మహమ్మారి చాలా ప్రభావం చూపించింది. జీఎస్టీ కంపన్సేషన్ లా ప్రకారం రాష్ట్రాలకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది’ అని ఫైనాన్స్ సెక్రటరీ చెప్పారు. ఈ మీటింగ్‌లో మినిస్ట్రీ ఆఫ్​ స్టేట్ ఫర్ ఫైనాన్స్ అనురాగ్ ఠాకూర్‌‌తోపాటు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. మీటింగ్ వివరాలను ఫైనాన్స్ సెక్రటరీ మీడియాకు వివరించారు. ఫైనాన్షియల్ ఇయర్ 2019–20కి గాను రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రూ.1.65 లక్షల కోట్లు విడుదల చేసింది. దీంట్లో మార్చి నెలకు రూ.13,806 కోట్లు రిలీజ్ చేసింది. కాగా, రాష్ట్రాల నుంచి కలెక్ట్‌ చేసిన మొత్తం రూ. 95,444 కోట్లు కావడం గమనార్హం.