టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్

టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్

ఐపీఎల్ ముగింపు దశకు చేరుకుంది. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్, రాజస్థాన్ జట్లు తొలి క్వాలిఫయర్  ఆడనున్నాయి. ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరగనుంది. టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ గేమ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగు పెట్టనుంది. ఓడిన జట్టు రెండో క్వాలిఫయర్లో గెలిచిన జట్టుతో ఫైనల్ పోరు కోసం పోటీ పడుతుంది. ఐపీఎల్ ఆరంభం నుంచే గుజరాత్ అదరగొడుతోంది. హార్దిక్ సారథ్యంలో 14 లీగ్ మ్యాచుల్లో 10 విజయాలు సాధించి 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఇదే ఉత్సాహాన్ని ఈ మ్యాచ్లోనూ కొనసాగించి ఫైనల్లోకి దూసుకెళ్లాలని భావిస్తోంది. 

అటు రాజస్థాన్ టీమ్..తొలి సీజన్ లో టైటిల్ ను దక్కించుకున్న తర్వాత..మరోసారి కప్ కొట్టింది లేదు. కేవలం మూడు సార్లు మాత్రమే ప్లేఆఫ్కు చేరింది. ఒక్కసారి కూడా ఫైనల్లో అడుగుపెట్టలేదు. ఈ సీజన్లో మాత్రం పర్వాలేదనిపించింది.  లీగ్ దశలో 14 మ్యాచులు ఆడిన రాజస్థాన్..9 విజయాలు, 5 ఓటములతో 18 పాయింట్లు సాధించి..రెండో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ సారి ఎలాగైనా కప్ కొట్టాలని కసితో ఉంది. ఈ గేమ్లో పటిష్ట గుజరాత్ను ఓడించి..నేరుగా ఫైనల్కు చేరుకోవాలని భావిస్తోంది. 

గుజరాత్ తుది జట్టు: 
వృద్ధిమాన్‌ సాహా, శుభమన్‌ గిల్‌, మథ్యూ వేడ్, కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా , డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, తేవాటియా, సాయి కిషోర్,  మహ్మద్‌ షమీ, అల్జరీ జోసెఫ్, యశ్ దయాల్.

రాజస్థాన్ తుది జట్టు: 
బట్లర్, యశస్వి జైస్వాల్, కెప్టెన్ సంజూ శాంసన్, పడిక్కల్ , హిట్ మెయర్, రియాన్ పరాగ్  , ఆర్. అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్దకృష్ణ, చాహల్, మెక్ కాయ్.