GT vs KKR : మోడీ స్టేడియంలో పరుగుల వరద.. కోల్కత్తా టార్గెట్ 205

GT vs KKR : మోడీ స్టేడియంలో పరుగుల వరద.. కోల్కత్తా టార్గెట్ 205

ఐపీఎల్ లో పరుగుల వరద పారుతోంది. ప్రతీ టీంలోని ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. అహ్మదాబాద్ లో కోల్ కత్తాతో జరుగుతోన్న మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి గుజరాత్ 204 పరుగులు చేసింది. ఓపెనర్లు సాహా (17, 17 బంతుల్లో), శుభ్ మన్ గిల్ (39, 31 బంతుల్లో) రాణించారు. వన్ డౌన్ లో వచ్చిన సాయి సుదర్షన్ (53, 38 బంతుల్లో) హాఫ్ సెంచరీతో రెచ్చిపోయాడు.

తనకు తోడు విజయ్ శంకర్ (63, 24 బంతుల్లో) కోల్ కత్తా బౌలర్లకు చుక్కలు చూపించాడు. అభినవ్ మనోహర్ (14, 8 బంతుల్లో)  కూడా ఉన్నంతసేపు దాటిగా ఆడాడు. దీంతో గుజరాత్ కు 204 పరుగుల భారీ స్కోర్ దక్కింది. కోల్ కత్తా బౌలర్లలో నరైన్ కు మూడు వికెట్లు దక్కాయి. ఇంపాక్ట్ ప్లేయర్ సుయాష్ శర్మ తన మిస్టరీ బౌలింగ్ తో ఒక వికెట్ పడగొట్టాడు. శార్దూల్ ఠాకూర్ 3 ఓవర్లు వేసి 40 పరుగులు ఇచ్చుకున్నాడు.