GT vs SRH: క్లాసెన్, మార్క్రామ్ ఔట్.. కష్టాల్లో హైదరాబాద్

GT vs SRH: క్లాసెన్, మార్క్రామ్ ఔట్.. కష్టాల్లో హైదరాబాద్

అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌తో జరుగుతున్న పోరులో సన్ రైజర్స్ బ్యాటర్లు తడబడుతున్నారు. మునుపటి మ్యాచ్‌లో పరుగుల వరద పారించిన హైదరాబాద్ బ్యాటర్లు.. గుజరాత్ బౌలర్ల వంతు వచ్చేసరికి ఆ జోరు కనపరచలేకపోతున్నారు. 15 ఓవర్లలోపే సన్ రైజర్స్ 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 

మయాంక్ అగర్వాల్(16), ట్రావిస్ హెడ్(19), అభిషేక్ శర్మ(29) స్వల్ప స్కోరుకే వెనుదిరగ్గా.. ఆదుకుంటారనుకున్న హెన్రిచ్ క్లాసెన్(24), ఐడెన్ మార్క్రామ్(17) వారి వెంటే పెవిలియన్ చేరారు. దీంతో సన్ రైజర్స్ 14.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. ప్రస్తుతం అబ్దుల్ సమాద్(0 నాటౌట్), షాబాజ్ అహ్మద్(6 నాటౌట్) క్రీజులో ఉన్నారు. వీరిద్దరిపైనే హైదరాబాద్ విజయావకాశాలు ఆధాపడి ఉన్నాయి. కనీసం 170 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశిస్తే కానీ, మ్యాచ్ లో పైచేయి సాధించలేరు.