బీజేపీతోనే భువనగిరి అభివృద్ధి : గూడూరు నారాయణరెడ్డి

బీజేపీతోనే భువనగిరి అభివృద్ధి : గూడూరు నారాయణరెడ్డి

యాదాద్రి, వెలుగు : బీజేపీ గెలిస్తేనే భువనగిరి అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని వలిగొండ మండలం సుంకిశాల, వెలువర్తి, కెర్చుపల్లి, పులిగిళ్ళ, కంచనపల్లి, పహిల్వానుపురంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పువ్వు గుర్తుకు ఓటేసీ తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. బీజేపీ గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారని, ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని చెప్పారు. భువనగిరిలో తాను గెలవగానే వలిగొండ మండలాన్ని హెచ్ఎండీఏ పరిధిలోకి తెచ్చి అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. అన్ని గ్రామాలకు రోడ్లు వేయించి బస్సు సౌకర్యం కలిపిస్తానని తెలిపారు.

మూసీ నదిని ప్రక్షాళన చేయిస్తానని చెప్పారు.   భువనగిరి లో ఇప్పటివరకు డిగ్రీ కళాశాల ను ఏర్పాటు చెయ్యలేని అసమర్థ ఎమ్మెల్యే  శేఖర్ రెడ్డి అని, తను గెలిచిన కొన్ని నెలల్లోనే స్వంత నిధులతో డిగ్రీ కళాశాల ను ఏర్పాటు చేయిస్తానని, భువనగిరి అసెంబ్లీ పరిధిలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన కోసం ఐటీ హబ్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. తద్వారా 30 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు, పరోక్షంగా వేల కుటుంబాలకు ఉపాధి కలుగుతుందని చెప్పారు. ఉపాధి కల్పించడం కోసం చర్యలు తీసుకుంటానని తద్వారా ఇంకా 60 వేల ఉద్యోగాల కల్పన సాధ్యం అవుతుందని తెలిపారు.

రజక, నాయి బ్రాహ్మణ  కులాలకు కిట్లను అందించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే విధంగా పోటీ పరీక్షల కోసం కోచింగ్​ సెంటర్లు ఏర్పాటు చేయించి ట్రైనింగ్​ ఇస్తానని చెప్పారు. గతంలో ఇచ్చిన టైనింగ్​ కారణంగా 79 మంది కానిస్టేబుల్​ ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. రుద్రెవెళ్లి, సంగెం వద్ద మూసీపై బ్రిడ్జీ కట్టిస్తానని తెలిపారు. ప్రచారంలో సీఎన్​ రెడ్డి, పడమటి జగన్ మోహన్ రెడ్డి, చిక్క క్రిష్ణ, చందా మహేందర్ గుప్తా, సుధాకర్ గౌడ్, ఎండీ మహమూద్ ఉన్నారు.