ఎమ్మెల్యే పైళ్లకు ప్రజా సమస్యలు పట్టవు : గూడూరు నారాయణ రెడ్డి

ఎమ్మెల్యే పైళ్లకు ప్రజా సమస్యలు పట్టవు : గూడూరు నారాయణ రెడ్డి

యాదాద్రి, వెలుగు : ప్రజల కోసమే బీజేపీ పని చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణ రెడ్డి తెలిపారు. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం రాయరావు పేటలో బీజేపీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్నారే తప్పా ప్రజల పక్షాన వారి ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రెండుసార్లు గెలిచినా సమస్యలు అలాగే ఉన్నాయని, ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.

ఈ సందర్భంగా బీజేపీలో చేరిన వివిధ పార్టీల లీడర్లు, కార్యకర్తలకు కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రోగ్రాంలో సురకంటి జంగారెడ్డి, నాశబోయిన సాయి, మెట్టు వినోద్, కోట్ల శ్రీనివాస్ గౌడ్, శివగౌడ్, వెంకటేశ్, శ్రీశైలం, రమేశ్, సాయి, భాస్కర్, వెంకట్ కుమార్, రాజు, క్రిష్ణ, బాలచందర్, పరుశరాములు ఉన్నారు.

ALSO READ :స్టేషన్ ఘన్ పూర్ లో కడియం శ్రీహరికి చెప్పుకోలేని కష్టం

వలిగొండలో టిఫిన్​ బైఠక్..

వలిగొండ మండలంలోని ఆర్రూర్​లో బీజేపీ టిఫిన్ బైఠక్​నిర్వహించింది. దీనిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై చర్చించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్​రావు, దాసరి మల్లేశం, సీఎన్​రెడ్డి, చందా మహేందర్​గుప్తా పాల్గొన్నారు.