
బజార్ హత్నూర్, వెలుగు: మండలంలోని మోడల్ స్కూల్లో టీజీటీ హిందీ, పీజీటీ ఇంగ్లీష్ గెస్ట్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రిన్సిపాల్ ప్రేమ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ, పీజీ చేసినవారు అర్హులని, ఈ నెల 26 లోగా స్కూల్లో దరఖాస్తులు అందించాలన్నారు. 6వ తరగతిలో 10 సీట్లు, 7–10వ తరగతి వరకు 40, ఇంటర్ ఫస్టియర్లో 10 సీట్లు మిగిలాయని, స్పాట్ అడ్మిషన్ల కోసం సంప్రదించాలని సూచించారు.