ప్రపంచంలోనే అతిచిన్న పార్కుగా గిన్నిస్ రికార్డ్

ప్రపంచంలోనే అతిచిన్న పార్కుగా గిన్నిస్ రికార్డ్

పార్కు చిన్నదైనా పెద్దదైనా.. అలా కాసేపు రిలాక్స్ అవ్వడానికి పనికొచ్చేలా ఉంటే బాగుంటుంది. కానీ, అమెరికాలోని పోర్ట్ లాండ్లో ఉండే ‘మిల్ ఎండ్స్' పార్కులో కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు. ఎందుకంటే అది ఉండేది రెండు అడుగులే కాబట్టి మిల్ ఎండ్స్ పార్కును రెండో ప్రపంచ యుద్ధం తర్వాతి రోజుల్లో కట్టారు. పోర్ట్లాండ్లో ఉద్యోగం చేస్తున్నడికి ఫాగన్ అనే కాలమిస్ట్.. ఆఫీస్ విండో నుంచి బయటకు చూసినప్పుడు అక్కడ రోడ్డుపైలైట్ పోల్ కోసం కేటాయించిన స్థలం ఖాళీగా ఉండడాన్ని గమనించాడు. 

ఎన్ని రోజులవుతున్నా అక్కడ పోల్ ఏర్పాటు. చేయకపోవడంతో దాన్ని పార్కుగా మార్చాలనుకున్నాడు. ఆ చిన్న ప్లేస్ లో మొక్కలు నాటి 'మిల్ ఎండ్స్ పార్క్' అని పేరు పెట్టాడు. అందులోకొన్నిపూల మొక్కలు నాటి దాన్ని జాగ్రత్తగా చూసుకునేవాడు. తను రాసే కాలమ్స్ పార్కు గురించి కూడా ప్రస్తావించేవాడు. దాంతో ఆ పార్కుని చూడడానికి చాలా మంది వచ్చేవాళ్లు. కొంతకాలానికి ఫాగన్ క్యాన్సర్ మరణించాడు. ఫాగస్ చనిపోయాక కూడా ఆ పార్కు అలానే ఉంది. ఫాగను గుర్తుగా అక్కడి వాళ్లు పార్కులో సీతాకోకచిలుకల కోసం చిన్న స్విమ్మింగ్ ఫూల్, డైవింగ్ బోర్డ్, ఫాగన్ పనిచేసిన బిల్డింగ్ మినియేచర్ ఏర్పాటు చేశారు. ఇది అతిచిన్న పార్కుగా గిన్నిస్ రికార్డుకెక్కింది.