పిల్లల స్నాక్స్ : చాక్లెట్ రెసిపీ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి.. ఎన్ని ఇచ్చినా క్షణాల్లో లాగించేస్తారు..!

పిల్లల స్నాక్స్ :  చాక్లెట్ రెసిపీ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి.. ఎన్ని ఇచ్చినా క్షణాల్లో లాగించేస్తారు..!

స్నాక్ ఐటమ్స్ లో పిల్లల ఫస్ట్ చాయిస్ చాక్లెట్. వాటికి కొన్ని నట్స్, ఇంకొన్ని ఫూట్స్ జతకడితే యమ్మీ అనాల్సిందే. మార్కెట్లో దొరికే కొన్ని హెల్దీ ఐటమ్స్ తో ఇంట్లోనే ఈజీగా చాక్లెట్స్ చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం... ఈ రెసీపీలు చేసి పిల్లల ముందు పెట్టి..  చాక్లెట్లతో వావ్ అనిపించండి.

సూపర్ ఫుడ్ చాక్లెట్ బార్స్ తయారీకి కావలసినవి 

  • డార్క్ చాక్లెట్ : ఒక కప్పు
  • చియా గింజలు :  ఒక టేబుల్ స్పూన్
  • కొకోవా నిబ్స్​: రెండు టేబుల్ స్పూన్లు (అన్ని రకాల నట్స్ కూడా వేసుకోవచ్చు)
  • హెంప్​ హార్ట్స్​ : ఒక టేబుల్​ స్పూన్​

సూపర్ ఫుడ్ చాక్లెట్ బార్స్ తయారీ విధానం

ఒక గిన్నెలో డార్క్ చాక్లెట్ చిప్స్ వేసి, బబుల్స్ లేకుండా బాగా మెల్ట్ చేయాలి. తర్వాత మిగిలిన పదార్థాలన్నీ (కొకోవా నిట్స్) వేసి బాగా కలపాలి.

ఒక వెడల్పాటి ట్రే తీసుకుని అందులో బటర్ పేపర్ వేయాలి. దానిపైన ఈ మిశ్రమాన్ని పరచి ఫ్రిజ్‌లో పెట్టాలి.పూర్తిగా ఫ్రీజ్ అయిన తర్వాత, మీకు నచ్చిన షేప్స్‌లో కట్ చేసుకోవాలి.

 బటర్ పేపర్ లేకపోయినా, క్యాండీ మౌల్డ్‌లను ఉపయోగించి కూడా ఈ చాక్లెట్లను తయారు చేసుకోవచ్చు.

ఓట్ మీల్ చాక్లెట్ ఫడ్జ్ బార్స్ తయారీకి కావలసిన పదార్థాలు

  • ఓట్స్: 2 3/4 కప్పులు
  • ఉప్పు : అర టీ స్పూన్​
  • యాపిల్ సిరప్ లేదా తేనె: అర కప్పు
  • పీనట్ బటర్: ముప్పావు కప్పు
  • చాక్లెట్ చిప్స్: ముప్పావు కప్పు 

ఓట్ మీల్ చాక్లెట్ ఫడ్జ్ బార్స్​ తయారీ విధానం
 
వెడల్పాటి ట్రే తీసుకుని అందులో బటర్ పేపర్ వేసి పక్కన పెట్టాలి. 

తర్వాత ఒక గిన్నెటో యాపెల్ సిరప్, తేనె, పావు కప్పు పీనట్ బటర్, నీళ్లు, వెనీలా ఎక్సిటాక్ట్ వేసి మెత్తగా అయ్యే వరకు కలపాలి. అందులో ఓటి, ఉప్పు కూడా వేసి కలపాలి. 

ఇప్పుడు వేరే గిన్నెట్లో చాక్లెట్ చిప్స్, అరకప్పు పీనట్ బటర్ వేసి వేడి చేయాలి. 

►ALSO READ  మీకు తెలుసా : పాప్ కార్న్ ఎప్పుడు.. ఎక్కడ పుట్టింది.. పాప్ కార్న్ ఆరోగ్యమా కాదా..?

తర్వాత బటర్ పేపర్ వేసిన ట్రేలో ముందు ఓట్స్ మిశ్రమం వేసి లేయర్ గా పరచాలి. దానిపైన మెట్టి చేసిన చాక్లెట్ ఇంకో లేయర్​ గా వేయాలి. 

ఇప్పుడు ఓట్స్ మిశ్రమాన్ని టాప్ లేయర్ గా వేసి ఫ్రిజ్​ లో పెట్టాలి. ఓట్స్ మిల్ చాక్లెట్ గట్టిగా అయ్యాక నచ్చిన షేప్స్​ కట్ చేసుకోవచ్చు.

రా చాక్లెట్ ఫడ్జ్ బాల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు

  • ఖర్జూరం :ఒకటిన్నర కప్పు (గింజలు లేనివి)
  • కొకోవా పౌడర్: ఒక టేబుల్ స్పూన్
  • ఉప్పు: చిటికెడు
  • కొబ్బరి తురుము : రెండు టేబుల్ స్పూన్లు

రా చాక్లెట్ ఫడ్జ్ బాల్స్ తయారీ విధానం

ఖర్జూరం, కొకోవా పౌడర్, ఉప్పు కలిపి బాగా మెత్తగా బ్లెండ్ చేయాలి. తర్వాత ఒక గిన్నెలో చిన్న స్కూప్స్ వేసి ఒక గంట ఫ్రిజ్​లో పెట్టాలి. 

ఫ్రీజ్ అయిన బాల్స్​ ను కొబ్బరి తురుము కొకోవా పౌడర్​ లో  రోల్​ చేయాలి.

 కొబ్బరి తురుము వద్దనుకుంటే ప్లెయిన్ గా తినవచ్చు.. పిల్లలకు ఎన్ని ఇచ్చినా క్షణాల్లో లాగించేస్తారు.